మా బృందం సభ్యులు Embrapa Director General తో
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో బ్రెజిల్ ఒకటి. గత 10 సంవత్సరాలకు పైగా 5% సగటు రేటు GDP పెరుగుదలతో మిగులు విదేశీ మారక విలువలు కలిగి ఉంది. బ్రెజిల్ యొక్క ఆర్థిక బలం చెప్పాలంటే గత 3 సంవత్సరాలలో బ్రెజిలియన్ కరెన్సీ విలువ అమెరికన్ డాలర్ తో పోల్చితే దాదాపు 30% వృద్ధి పొందింది.
బ్రెజిల్ ఆర్టిక వ్యవస్తలో పరిశ్రమలు, వ్యవసాయం, మరియు ఇంధన శక్తి ప్రముఖ పాత్ర వహించుతున్నాయి. కాని ఇటీవల సర్వీసెస్ రంగంలో కూడా బ్రజిల్ దూసుకు పోతుంది. అంతేకాకుండా వోక్స్‌వాగన్, జనరల్ మోటార్స్, ఫోర్డ్, ఫియట్, హోండా, మరియు టయోటా వంటి అంతర్జాతీయ కార్ల పరిశ్రమల ప్రవేశంతో బలమైన ఆటోమోటివ్ పరిశ్రమ పెంపొందింది. భారతదేశం ఏటా సుమారు 3.5 మిలియన్ కార్లు తయారు చేస్తే, బ్రెజిల్ ప్రతి సంవత్సరం 4 మిలియన్ల కార్లు తయారు చేస్తున్నది. ప్రపంచంలోనే మొదటగా బ్రెజిల్ కార్లు, గాసోలిన్, ఇథనాల్ మిక్స్ ద్వార నడపడానికి ఇంధన సాంకేతిక పరిజ్ఞానం సంపాదించి అమలుచేయడానికి అవసరమైన చట్టం రూపొందించింది. ప్రపంచలో బ్రెజిల్ను మొదటి సమర్థనీయ బయో ఇంధన ఆర్థిక వ్యవస్థ గల దేశంగా బావిస్తారు. బ్రెజిల్ FIFA ప్రపంచ కప్ కు 2014 లో అలాగే 2016 లో ఒలింపిక్స్ ఆతిధ్యం ఇవ్వబోతుంది. రాబోయే నాలుగు సంవత్సరాలలో బ్రెజిల్ మౌలిక సదుపాయాలు, సర్వీసెస్ రంగాలలో గణనీయమైన పెట్టుబడులు పెడుతుందని భావిస్తున్నారు.
మేము మొదటి దక్షిణ ఆఫ్రికన్ ఎయిర్ లైన్స్ ద్వారా Brassilia చేరుకున్నాము. Brasilia ఒక అద్భుతమైన నగరం. ఈ పట్టణం 1960 నుండి బ్రెజిల్ రాజధాని నగరంగా ఉంది. నగరంలో సంవత్సరం పొడుగునా అద్భుతమైన వాతావరణం ఉంటుంది. Brasilia దక్షిణ అమెరికాలో అత్యంత సృజనాత్మక, ఆధునిక నిర్మానాలు కలిగిన నగరం ఎందుకంటే అది ఇటీవల నిర్మించిన నగరం. నగరంలో ఆకాశమంత ఎత్తులో ఆసక్తికరమైన భవనాలు ఉన్నాయు. ముఖ్యంగా, బ్రెజిలియన్ అధ్యక్షుడు నివసించే Palacio da Alvorada వంటి రాజభవనాలు ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి.
జోసేలినో కుబెశాకే (Juscelino Kubitschek) 1956 లో "ఐదు యాభై సంవత్సరాలు" నినాదంతో బ్రెజిల్ అధ్యక్షుడు గా ఎన్నికయ్యారు. బ్రెజిల్ క్రితం యాభై సంవత్సరాలు గా సాదించిన అభివృద్ధి తన ఐదు సంవత్సరాల కాలంలోనే సాదించాలని అతని ప్రణాళిక. అందుకే 1956 లో కొత్త రాజధాని నిర్మించడానికి యువ శిల్పి, ఆస్కార్ ను ఆహ్వానించాడు. బ్రెజిల్ లో Oscar Niemeyer గొప్ప 20 వ శతాబ్దం ఆర్కిటెక్ట్ గా పరిగణించబడుతాడు. నగర నిర్మాణం పూర్తి కాకుండానే Juscelino రాజధాని Brasília వ్యవస్థాపకుడు కావాలనే ఆలోచనతో అధికారికంగా ఏప్రిల్ 22 1960 న నగరం ప్రారంబించాడు.
స్నేహితుడు అమర్ నాథ్ రెడ్డి తో, బ్రెజిలియన్ పార్లమెంట్ భవనం ముందు
Brasilia, కేవలం ఒక పరిపాలన నిర్వాహక నగరం. అధ్యక్షుడు మరియు అతనిఆఫీసు, నేషనల్ కాంగ్రెస్, సుప్రీం కోర్ట్ సీటు, మరియు అన్ని మంత్రి వర్గ భవనాలు నగరంలో ఒకే చోట వుంటాయు. Juscelino Kubitschek మెమోరియల్ అతని రాజధాని నిర్మాణ ఫలితానికి ఒక నివాళిగా ఉంది. ఇక్కడే Juscelino Kubitschek సమాధి వుంది. ఈ భవనంలో నగర చరిత్ర గురించి పూర్తి సమాచారం వుంది. మెట్రోపాలిటన్ కేథడ్రాల్ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ ఆస్కార్ నేమేయర్ మేధస్సుకు ఒక ప్రత్యేకమైన నిదర్శనం. ఈ అద్భుతమైన కేథడ్రాల్ లోపల సుందరమైన గాజు పనితనం ఉంది. Brasilia TV టవర్ నగరంలో ఎత్తైన భవనాలలో ఒకటి. బ్రెజిల్ జాతీయ కాంగ్రెస్, పార్లమెంట్ భవనం ఆస్కార్ నేమేయర్ నిర్మించిన మరొక ప్రత్యేక భవనం. Embrapa కాంపస్ చేరుకోగానే మాకు డైరెక్టర్ జనరల్ ఆహ్వానం పలికారు. నేను ఆంధ్రప్రదేశ్ మరియు బ్రెజిల్ మధ్య సహకారానికి ఒక పవర్ పాయింట్ ప్రదర్శన ఇచ్చాను.
Brasillia లో మూడు రోజులు గడిపిన పిదప, మేము TAM ఎయిర్ లైన్స్ ద్వారా రియో డి జనీరో చేరుకున్నాం. రియో డి జనీరో లేదా రియో బ్రెజిల్ దేశ సౌత్ ఈస్ట్ ప్రాంతంలో సుందర పర్వతాల మద్య , అట్లాంటిక్ సముద్రం ఒడ్డున ప్రపంచంలో అత్యంత సుందరమైన నగరంగా గుర్తింపు పొందింది. చాలా యాత్రికులు తరచుగా న్యూయార్క్ నగరం ఎప్పుడూ పడుకోదు అని వింటారు, కానీ రియో నగరం కూడా ఎప్పుడూ కన్ను మూయదు అంటే అతిశయోక్తి కాదు. మేము రియోలో Ipanema బీచ్ సమీపంలో Copacabana Beach ఎదురుగా ఒక ఆధునిక పదిహేను అంతస్తుల హోటల్ లో బస చేసాం. మేం హోటల్ నుండి Copacabana Beach పొడవునా చేసిన వాకింగ్, మద్యలో కొబ్బరి బొండాల నీరుతో రిలాక్స్ కావడం, Ipanema బీచ్ లో ఇతర యాత్రికులు అక్కడ వెలువడే సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్ చేయడం మేం మరిచిపోని జ్ఞాపకాలలో కొన్ని మాత్రమే. రియో డి జనీరో లో ప్రతి సంవత్సరం ఈస్టర్ కు 46 రోజుల ముందు జరిగే సాంబ, కార్నివాల్ పోటీలు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక హైలైట్. మేం వెళ్ళినపుడు కార్నివాల్ లేకున్నా ఆ పోటీలు జరిగే Sambodromo సమీపంలో ఒక theater లో ఒక రాత్రి Samba డాన్సు చూసాం.
సాంప్రదాయ సాంబా నృత్య దుస్తుల సంగ్రహాలయం లో
క్రీస్తు విగ్రహం చూడటానికి ట్రామ్ రైల్లో ముప్పై నిమిషాల Corcovado పర్వత ప్రయాణం ఒక ఆసక్తికరమైన అనుభవం. రైలు మెల్లగా కొండపై ప్రయాణం చేస్తూ దట్టమైన అడవి గుండా వెళుతుంది. మేం పర్వతం చేరుకోవటానికి కొద్ది నిమిషాల ముందు కుడి చేతి వైపు ఎత్తైన చెట్ల సందుల మధ్యనుండి రియో నగర సుందర దృశ్యాలు మమ్ముల్ని ఆకర్షించాయి. మార్గ మద్యంలో ఒక సాంబ మ్యూజిక్ బ్యాండ్ బృందం ట్రామ్ ఎక్కి ప్రయాణం పొడవునా మాకు వీనుల విందైన సంగీతాన్ని అందించింది. మీకు నచ్చితే, ఇష్టమైతే వాళ్లకు టిప్స్ కూడా ఇవ్వవచ్చు. ట్రామ్ రైల్ దిగగానే కొండ పైకి వెళ్ళడానికి సుమారు 200 మెట్లు ఎక్కవలసి వుంటుంది. లిఫ్టులు, ఎలివేటర్స్ కూడా ఉంటాయి. మేము మెట్లగుండానే పది నిమిషాల్లో కొండ పైకి వెళ్ళగానే మాకు మొదట విగ్రహం వెనుక బాగం కనిపించింది.
మేము చేరుకున్నప్పుడు కొండపై మబ్బులు క్రమ్మి వాతావరణం అంత బాగా లేదు. మేం క్రీస్తు విగ్రహాన్ని, ఏంతో గొప్పగా విన్న రియో అందాలను సరిగా చూడగాలుగుతామో, లేదోనని అటు, ఇటు తిరుగుతూ అరగంట గడిపాం. అంతలో సూర్యుడు మెల్లగా కనిపిస్తూ, విగ్రహం చుట్టూ ఉన్న మేఘాలు తొలగి పోతూ ఉండడంతో మా ఆనందానికి అవధులు లేకపోయింది. కొండపై నుండి ఎటు చూసినా శోభాయమానమైన, రమణీయ దృశ్యాలే.
ద్రాక్షసారా కర్మాగారము, పోర్ట్ అలెగ్రె.
మేము రియో నుండి TAM ఎయిర్ లైన్స్ ద్వార Porte Alegro చేరుకొని మూడు గంటల సౌకర్యవంతమైన కోచ్ రైడ్లో Benta Gonsalves పట్టణం వెళ్ళాం. Benta Gonsalves పట్టణం రియో గ్రాండ్ డూ సూల్ ప్రాంతంలో ఇటాలియన్ మూలాలు గలవారి మెజారిటీతో ఉండడంతో ఆ సంస్కృతి, సంప్రదాయాలు ఎక్కువగా కనబడుతాయు. ఈ ప్రాంతం అంతా లోయలతో ద్రాక్ష తోటలకు మరియు వైన్ ఉత్పత్తికి చాలా ప్రసిద్ది కావటంతో ఇది "వైన్ కాపిటల్ అఫ్ బ్రెజిల్" గా పిలువబడుతోంది. మేం పట్టణం దగ్గరలో వున్న అరోరా వినేయర్డ్ దర్శించాము. అక్కడ సంవస్తరాల తరబడి వైన్ తో నిలువవున్న ఓక్ బ్యారెళ్ల మధ్య enologists మాకు వైన్ ఉత్పత్తి ప్రక్రియ వివరించారు. పర్యటన ముగిసే సమయంలో మేము వివిధ ద్రాక్షారసాల రుచి ఆస్వాదించాము. ఇక్కడి రెస్టారెంట్లు విలక్షణ ఇటాలియన్ వంటకాలతో, సంగీతంతో , ప్రతిరోజూ, యాత్రికులను అలరారుస్తాయి.
తయారు చేసిన ద్రాక్ష సారా, చెక్క పీపాలలో, భూగర్భంలో నిల్వ చేస్తారు.
Porte అలేగ్రోకి ఇటాలియన్ ప్రాంత రాజధానిగా పిలువబడే గారిబాల్ది నగరంగుండా సాగిన మా తిరుగు ప్రయాణం యూరోపును గుర్తుచేస్తూ మళ్లీ ఏదో యూరప్ దేశంలో ఉన్న అనుభూతిని కలిగించింది.
పోర్చుగీసువారు నిర్మించిన పురాతన రైల్వే స్టేషన్ ముందు, సావొ పాలొ.
బ్రెజిల్లో మేం చివరగా ఆ దేశంలో అతి పెద్ద నగరం, వాణిజ్యానికి కేంద్రమైన సావో పాలో నగరం దర్షించాము. నిత్యం ట్రాఫిక్ జామ్ లతో నగరం ఏ మాత్రం సురక్షితం కాదని మేం విన్నాం. నగరం అంతా దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన వలసదారులతో ప్రతిరోజూ చాలా ఉరుకులు,పరుగులు తో ఉంటుంది. సాధారణంగా బ్రెజిల్ వాసుల సంస్కృతి పగలు పని, రాత్రి జీవితం వినోదం అని అంటుంటారు. విశాలమైన సావో పాలో నగరం క్లబ్బులు, థియేటర్లు, మ్యూజియంలు, నృత్యనాటిక, శాస్త్రీయ సంగీత ప్రదర్శనశాలలు, రెస్టారెంట్లు మరియు సూర్యోదయంవరకు సాగే రాత్రి వినోదాలకు చాలా ప్రసిద్ది. ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది నగరానికి గుండెకాయగా పిలువబడే పాలిస్తా అవెన్యూ. అవెన్యూ పొడవైన ఆకాశహర్మ్యాలు, దుకాణాలు, చర్చిలు, రెస్టారెంట్లు, కేఫ్లు, మ్యూజియంలు హోటల్స్, మరియు చెట్లతో ఉంటుంది. ఒక మధ్యాహ్నం మేము సావో పాలో యొక్క చారిత్రాత్మక డౌన్ టౌన్ వెళ్ళాం. మా రెండు వారాల బ్రెజిల్ పర్యటన ఒక జీవిత కాలపు ఆనందం మరియు అనుభవం. నా ఈ బ్రెజిల్ ప్రయాణ విశేషాలు కొందరికైనా ఉపయోగపడుతాయని ఆశిస్తున్నాను. మీరు ఎప్పుడైనా బ్రెజిల్ వెళితే కొన్ని పోర్చుగీస్ పదాలు నేర్చుకుంటే కచ్చితంగా ఉపయోగపడతాయి.
ఫ్రీడం మెమొరియల్, సావొ పాలొ.
Devi prasad garu, meru cheppinatte Brasilia chala andamaina nagaram. Oscar nemier buildingsne design chesaru. Mottam city ni plan chesindi Lusio costa. Idi modern town planning lo oka landmark ga nilustundi. Transportation wise kuda chala baga plan chesaru.Maa town planning curriculam lo nenu ee city ni books and internet dvara study chesanu. President Kubetschik ee city formation gurinchi oka book kuda vrasaru. It is available in google books.
ReplyDeleteMottam paryatananu chala chakkaga varninhcaru. Abhinandanalu.
Good travelogue. I visited Campina Grande in Paraiba state in Brazil during April 2011 to see the ecological farming in smallholder farmers. I have seen more Ongole breed cows and oxen more than in Prakasam district. I am from Prakasam district.
ReplyDeleteచాలా బావుందండి. అభినందనలు
ReplyDelete@కొత్త పాళీ: మీ స్పందనకు కృతజ్ఞతలు.
ReplyDelete@షివ: మీకు వ్యవసాయం మీద మక్కువ ఉన్నట్లుంది, నిజమే వాస్తవానికి మన ఒంగోల్ గిత్తను తీసుకెల్లి వారు లోకల్ బ్రీడ్ డెవలప్ చేసారు.
ReplyDelete@ chkc: ఒక ఇంజినీరింగ్/అర్కిటెక్చర్ స్టూడెంట్ కు నా పర్యటన అనుభవం నచ్చినందుకు సంతోషం.
ReplyDelete